‘కల్కి’లో కృష్ణుడు ఇతనే!

ABN , Publish Date - Jun 29 , 2024 | 04:01 AM

అమితాబ్‌, కమల్‌హాసన్‌, ప్రభాస్‌, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గురువారం విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కురుక్షేత్ర యుధ్ధం నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో శ్రీకృష్ణుని పాత్ర పోషించిన...

‘కల్కి’లో కృష్ణుడు ఇతనే!

అమితాబ్‌, కమల్‌హాసన్‌, ప్రభాస్‌, దీపికా పదుకొనే వంటి అగ్ర నటీనటులు నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గురువారం విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కురుక్షేత్ర యుధ్ధం నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో శ్రీకృష్ణుని పాత్ర పోషించిన నటుడి ముఖాన్ని చూపించకపోవడంతో అతనెవరా.. అనే చర్చ మొదలైంది. ఆ పాత్ర పోషించిన నటుడి నడక తీరు చూసి హీరో నాని అన్నారు కొందరు. కాదు కాదు అర్జున్‌దాస్‌ అన్నారు మరికొందరు. ఈ చర్చకు తెర దించుతూ ఆ సినిమాలో కృష్ణ పాత్ర పోషించింది నేనే అంటూ సోషల్‌ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు తమిళ నటుడు కృష్ణకుమార్‌ బాలసుబ్రహ్మణ్యన్‌. ‘ఒక అద్భుత చిత్రంలో అటువంటి ప్రత్యేక పాత్ర పోషించే అవకాశం రావడం నిజంగా అదృష్టం’ అని ఆయన పేర్కొన్నారు. కృష్ణకుమార్‌ కొత్త నటుడేమీ కాదు, 2010లోనే ఆయన చిత్ర రంగ ప్రవేశం చేశారు. ‘కదలగై’ తమిళ చిత్రంలో నటించిన ఆయన ఆ తర్వాత రంగస్థల ప్రవేశం చేసి పలు నాటకాల్లో నటించారు.


పదేళ్ల తర్వాత మళ్లీ తమిళ చిత్రరంగ ప్రవేశం చేశారు. సూర్య నటించిన అనువాద చిత్రం ‘ఆకాశం నీ హద్దు’లో కీలక పాత్ర పోషించారు. ధనుష్‌ ‘మారన్‌’ సినిమాలో అతనికి ఫ్రెండ్‌గా నటించారు. ‘కల్కి’ కృష్ణకుమార్‌కు ఐదో చిత్రం కావడం గమనార్హం.

Updated Date - Jun 29 , 2024 | 04:01 AM