ఇదొక ఎక్స్‌ట్రార్డినరీ చిత్రం

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:26 AM

మలయాళంలో ఘనవిజయం అందుకున్న సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’. అక్కడ రూ. 200 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రేక్షకుల ముందుకు...

ఇదొక ఎక్స్‌ట్రార్డినరీ చిత్రం

మలయాళంలో ఘనవిజయం అందుకున్న సర్వైవల్‌ థ్రిల్లర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’. అక్కడ రూ. 200 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోన్న సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు చిదంబరం మాట్లాడుతూ ‘మైత్రీ మూవీ మేకర్స్‌కు నా ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు మా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ చిత్రాన్ని ఆదరించాలి. సరికొత్త వినోదాన్ని పంచే చిత్రమిది’ అని అన్నారు నిర్మాత నవీన్‌ యెరే ్నని మాట్లాడుతూ ‘ఇదొక ఎక్స్‌ట్రార్డినరీ ఫిల్మ్‌. ఈ మధ్యకాలంలో నేను చూసిన గొప్ప చిత్రం కూడా. తెలుగులోనూ పెద్ద విజయాన్ని సాధిస్తుంది. మన ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు’ అని చెప్పారు. యువతను మెప్పించే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయని నటుడు శ్రీనాథ్‌ భాసి చెప్పారు.

Updated Date - Apr 05 , 2024 | 03:26 AM