నా కెరీర్‌లో ఇది చాలా స్పెషల్‌ మూవీ

ABN , Publish Date - Jan 25 , 2024 | 04:44 AM

సుహాస్‌ హీరోగా రూపొందిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. దుష్యంత్‌ కటికినేని దర్శకత్వంలో ధీరజ్‌ మొగిలినేని నిర్మించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు...

నా కెరీర్‌లో ఇది చాలా స్పెషల్‌ మూవీ

సుహాస్‌ హీరోగా రూపొందిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. దుష్యంత్‌ కటికినేని దర్శకత్వంలో ధీరజ్‌ మొగిలినేని నిర్మించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో దర్శకుడు మాట్లాడుతూ ‘కొన్ని రియలిస్టిక్‌ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాం. లవ్‌స్టోరీతో పాటు ఇంటెన్స్‌ డ్రామా ఉంటుంది. ఊరిలో జరిగే కథ కనుక కులాల ప్రస్థావన ఉంటుంది. అయితే ఎవరినీ కించేపరిచే అంశాలు ఇందులో ఉండవు. సినిమాను మీరే సూపర్‌ హిట్‌ చేయాలి. సినిమా మేకింగ్‌లో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అన్నారు. ‘నేను నిర్మాతగా మీ ముందు నిలబడడానికి అల్లు అరవింద్‌, బన్నీ వాస్‌గార్లు కారణం. సినిమా కనుక తీస్తే హిట్‌ మూవీనే తీయాలని అనుకున్నాను. ఈ చిత్రకథ వినగానే బన్నీ వాసుగారు చాలా ఎగ్జైట్‌ అయ్యారు. సుహాస్‌ కూడా చాలా ఇన్వాల్వ్‌ అయ్యాడు. ఈ సినిమా కోసం రెండు సార్లు గుండు చేయించుకున్నాడు. హీరోయిన్‌ శివానీ, శరణ్య ప్రదీప్‌ తదితరులు అద్భుతంగా నటించారు. మా ఛాయాగ్రాహకుడు వాజిద్‌ అమలాపురం ప్రాంతాన్ని అద్భుతంగా తెరకు ఎక్కించారు. సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర మంచి ట్యూన్స్‌ ఇచ్చారు. సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. మా సంస్థ ద్వారా చాలా చిత్రాలు రానున్నాయి. అరవింద్‌గారి పేరు నిలబెట్టాలా ప్రతి సినిమాకూ కష్టపడతాం’ అన్నారు నిర్మాత ధీరజ్‌. చివరిగా హీరో సుహాస్‌ మాట్లాడుతూ ‘నిన్ననే నాకు బాబు పుట్టాడు. ఆ హ్యాపీలో ఉన్నా. అలాగే ఈ సినిమా రిలీజ్‌ కోసం ఎదురు చూస్తున్నా. నా కెరీర్‌లో ఇది చాలా స్పెషల్‌ మూవీ. కథ మీద నమ్మకంతో చాలా కనెక్ట్‌ అయి వర్క్‌ చేశా. సినిమా చూస్తున్నప్పుడు మీ జీవితంలో జరిగిన సందర్భాలను గుర్తు చేసుకుంటారు’ అన్నారు.

Updated Date - Jan 25 , 2024 | 04:44 AM