ఈ గ్యాప్‌ నాకు చాలా నేర్పింది

ABN , Publish Date - Jul 10 , 2024 | 01:26 AM

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో ఆరంగేట్రం చేసి.. వరుస సినిమాల్లో నటించారు నభా నటేశ్‌. కానీ 2021లో వచ్చిన ‘మాస్ట్రో’ సినిమా తర్వాత తెరపై కనిపించలేదు. ఈ విరామానికి కారణాన్ని ఆమె...

‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో ఆరంగేట్రం చేసి.. వరుస సినిమాల్లో నటించారు నభా నటేశ్‌. కానీ 2021లో వచ్చిన ‘మాస్ట్రో’ సినిమా తర్వాత తెరపై కనిపించలేదు. ఈ విరామానికి కారణాన్ని ఆమె లేటెస్ట్‌గా నటించిన ‘డార్లింగ్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌లో తెలిపారు. ‘‘2022లో నాకు యాక్సిడెంట్‌ అయ్యింది. ఆ సమయంలో నా చేతిలో మూడు ప్రాజెక్ట్స్‌ ఉన్నందున.. వాటిని పూర్తి చేసేందుకు సర్జరీ చేసుకుని తగినంత విరామం లేకుండా సెట్స్‌లో అడుగుపెట్టాను.. దాంతో ఆ గాయం తిరగబెట్టింది. అందుకే ఇన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పటివరకూ నేను గ్లామరస్‌ పాత్రలే ఎక్కువ పోషించాను. ఈ గ్యాప్‌ నాకు చాలా నేర్పింది. ఇప్పటి నుంచి నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లోనూ నటించాలనుకుంటున్నాను.


అందుకే స్ర్కిప్‌ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాను’’ అని చెప్పారు. నభా నటించిన ‘డార్లింగ్‌’ చిత్రం ఈ నెల 19న విడుదల కానుండగా, ఆమె నటిస్తున్న ‘స్వయంభు’ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.

Updated Date - Jul 10 , 2024 | 01:26 AM