ముచ్చటగా మూడోసారి

ABN , Publish Date - Mar 01 , 2024 | 06:30 AM

నిర్మాత శివలెంక కృష్ట ప్రసాద్‌, దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ ముచ్చటగా మూడోసారి ఓ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ చిత్రంలో కఽథానాయకుడిగా...

ముచ్చటగా మూడోసారి

నిర్మాత శివలెంక కృష్ట ప్రసాద్‌, దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ ముచ్చటగా మూడోసారి ఓ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ చిత్రంలో కఽథానాయకుడిగా ప్రియదర్శి నటించనున్నారు. మార్చి నెలాఖరు నుంచి ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. సూపర్‌ హిట్‌ కాంబోగా పేరున్న వీరిద్దరి నుంచి గతంలో వచ్చిన రెండు చిత్రాలూ విశేష ప్రేక్షకాదరణను పొందాయి. దీంతో ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి వీరిద్దరి కలయికలో వచ్చిన మొదటి చిత్రం ‘జెంటిల్‌మేన్‌’ 2016లో విడుదలై భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ సినిమాలో నాని, నివేథా థామస్‌, సురభి నటించారు. ఆ తర్వాత 2017లో వచ్చిన మరో సూపర్‌ హిట్‌ చిత్రం ‘సమ్మోహనం’ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇందులో సుధీర్‌ బాబు, అదితి రావు హైదరీ ప్రధాన పాత్రలు పోషించారు.

Updated Date - Mar 01 , 2024 | 06:30 AM