శేఖర్‌ కమ్ములతో మూడో సినిమా!

ABN , Publish Date - Feb 01 , 2024 | 02:55 AM

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే అద్భుతమైన చిత్రాలను రూపొందించడంలో పేరొందిన దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ప్రస్తుతం నాగార్జున, ధనుష్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు...

శేఖర్‌ కమ్ములతో మూడో సినిమా!

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే అద్భుతమైన చిత్రాలను రూపొందించడంలో పేరొందిన దర్శకుడు శేఖర్‌ కమ్ముల. ప్రస్తుతం నాగార్జున, ధనుష్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే శేఖర్‌ కమ్ములతోనే మరో చిత్రాన్ని నిర్మించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ బుధవారం ప్రకటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, అమిగోస్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. సోనాలి నారంగ్‌ ఈ చిత్రానికి సమర్పకురాలు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న ఈ చిత్రం లార్జర్‌ దాన్‌ లైఫ్‌గా ఉండబోతోందని నిర్మాతలు వెల్లడించారు. టాప్‌ క్లాస్‌ టెక్నీషియన్లతో, హై బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తామన్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ప్రస్తుతం నిర్మిస్తున్న చిత్రం పూర్తి కాగానే కొత్త సినిమా సెట్స్‌కు వెళుతుందని నిర్మాతలు వెల్లడించారు. ఇంతకుముందు నాగచైతన్య, సాయిపల్లవి, శేఖర్‌ కమ్ముల కాంబినేషన్‌లో ‘లవ్‌స్టోరీ’ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్మోహనరావు నిర్మించిన సంగతి విదితమే.

Updated Date - Feb 01 , 2024 | 10:03 AM