ఆలోచించి ఓటు వేయండి

ABN , Publish Date - May 08 , 2024 | 05:10 AM

ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకోవండానికి రకరకాల మార్గాలు వెదుకుతున్నాయి. ఓట్లు కొనేసి తర్వాత ప్రజలకు...

ఆలోచించి ఓటు వేయండి

ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. రాజకీయ పార్టీలు ప్రజలను ఆకట్టుకోవండానికి రకరకాల మార్గాలు వెదుకుతున్నాయి. ఓట్లు కొనేసి తర్వాత ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మవద్దు, గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండి అంటూ చెబుతున్నారు ‘కమిటీ కుర్రోళ్లు’. నిహారిక కొణిదెల సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నుంచి ‘గొర్రెల్లా..’ అంటూ సాగే పాటను రాజకీయ ప్రముఖుడు జయప్రకాశ్‌ నారాయణ విడుదల చేశారు. నాగ్‌ అర్జున్‌రెడ్డి రాసిన ఈ పాటకు అనుదీప్‌ దేవ్‌ స్వరాలు అందించారు. ఈ సినిమాతో యదు వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలు. చక్కని పాట రాసిన గీత రచయితను జయప్రకాశ్‌ నారాయణ అభినందించారు. భవిష్యత్‌ గురించి ఆలోచించి ఓటు వేయాలని యువతను ఆయన ఈ సందర్భంగా కోరారు. మంచి ప్రయత్నం చేసిన ‘కమిటీ కుర్రోళ్లు’ టీమ్‌ను ఆయన అభినందించారు.

Updated Date - May 08 , 2024 | 05:10 AM