నన్నే హీరోయిన్‌గా అనుకున్నారు

ABN , Publish Date - Feb 08 , 2024 | 05:19 AM

సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఫాంటసీ అడ్వెంచర్‌ ‘ఊరుపేరు భైరవకోన’. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రాజేశ్‌ దండా నిర్మించారు. ఈ నెల 16న ఈ చిత్రం విడుదలవుతోంది...

నన్నే హీరోయిన్‌గా అనుకున్నారు

సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఫాంటసీ అడ్వెంచర్‌ ‘ఊరుపేరు భైరవకోన’. వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రాజేశ్‌ దండా నిర్మించారు. ఈ నెల 16న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ మీడియాతో మాట్లాడారు.

  • ఈ కథ రాసుకున్నప్పుడే నన్ను హీరోయిన్‌గా అనుకున్నానని ఆనంద్‌ చెప్పారు. స్టోరీ చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. ‘అసలు ఇలాంటి కథను ఎలా ఊహించగలిగారో’ అనిపించింది. ఇలాంటి పాత్ర గతంలో ఎప్పుడూ చేయలేదు. అందుకే నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం అడిగాను. ఆనంద్‌ పాత్ర గురించి వివరంగా చెప్పాక నేను చేయగలననే నమ్మకం ఏర్పడింది.

  • పూర్తిస్థాయి వినోదం పంచే చిత్రమిది. ప్రేక్షకులకు మంచి సందేశం, ఉత్కంఠభరితమైన ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. అద్భుతం అనిపించే అతీంద్రియ శక్తుల నేపథ్యం ఉంటుంది. సినిమా నిర్మాణం విషయంలో మేకర్స్‌ ఎక్కడా రాజీపడలేదు.

  • ‘స్వాతిముత్యం, మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌’ చిత్రాల్లో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో కనిపించాను. ఈ చిత్రంలో వాటికి భిన్నంగా ‘భూమి’ అనే గిరిజన యువతి పాత్రలో కనిపిస్తాను. ఊళ్లో తనొక్కతే చదువుకున్న అమ్మాయి. అందంగా, అమాయకంగా కనిపిస్తుంది. కానీ చాలా బలమైన పాత్ర. యాక్షన్‌ సీన్లు కూడా ఉన్నాయి.

  • మాది కూర్గ్‌. మా జీవితంలో ప్రకృతి ఒక భాగం. చెట్లు, నదులు, కొండలు, జంతువులను ఆరాధించే సంస్కృతి మాది. భూమి పాత్రను అర్థం చేసుకోవడానికి ఆ అనుభవాలు ఉపయోగపడ్డాయి. సందీప్‌ కిషన్‌ అద్భుతమైన సహనటుడు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. వీఐ ఆనంద్‌తో వర్క్‌ చేయడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది.

Updated Date - Feb 08 , 2024 | 05:19 AM