మాట నిలబెట్టుకున్నారు

ABN , Publish Date - May 03 , 2024 | 05:28 AM

ప్రముఖ నిర్మాత కె.ఎల్‌.నారాయణ సుదీర్ఘ విరామం తర్వాత రాజమౌళి, మహేశ్‌బాబు కలయికలో వస్తున్న సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఆయన ఈ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు...

మాట నిలబెట్టుకున్నారు

ప్రముఖ నిర్మాత కె.ఎల్‌.నారాయణ సుదీర్ఘ విరామం తర్వాత రాజమౌళి, మహేశ్‌బాబు కలయికలో వస్తున్న సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఆయన ఈ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్‌ను 15 ఏళ్ల క్రితమే ఫిక్స్‌ చేశాం. ప్రస్తుతం వారి క్రేజ్‌ ఆకాశాన్ని తాకేలా ఉంది. రాజమౌళికి హాలీవుడ్‌ నుంచి కూడా ఆఫర్స్‌ వస్తున్నాయి. అయినా వాటిని కాదనుకుని ఇచ్చిన మాటకు కట్టుబడిన రాజమౌళి, ‘దుర్గా ఆర్ట్స్‌’ బ్యానర్‌లోనే ఈ మూవీ తీస్తున్నామని ప్రకటించి మాట నిలబెట్టుకున్నారు. రెండు నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్‌ సాగుతోంది. ఆగస్టు లేదా సెప్టెంబరులో చిత్రీకరణ ప్రారంభం అవుతుంది’’ అని చెప్పారు.

Updated Date - May 03 , 2024 | 05:28 AM