సినిమా చూస్తూ నవ్వుతూనే ఉంటారు

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:50 AM

చైతన్యా రావు, సునీల్‌, శ్రద్ధా దాస్‌, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రలు పోషించిన క్రైమ్‌ కామెడీ ‘పారిజాత పర్వం’ఈ నెల 19న విడుదల కానుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ చిత్రం...

సినిమా చూస్తూ నవ్వుతూనే ఉంటారు

చైతన్యా రావు, సునీల్‌, శ్రద్ధా దాస్‌, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రలు పోషించిన క్రైమ్‌ కామెడీ ‘పారిజాత పర్వం’ఈ నెల 19న విడుదల కానుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ ముఖ్య అతిధిగా పాల్గొని బిగ్‌ టికెట్‌ను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు వైవా హర్ష మాట్లాడుతూ ‘రెగ్యులర్‌ సినిమాలు కాకుండా ఇలాంటి డిఫరెంట్‌ చిత్రాలు రావాలంటే నిర్మాతలకు గట్స్‌ ఉండాలి. నేను ఎంజాయ్‌ చేస్తూ నటించిన సినిమా ఇది’ అన్నారు. ఒక పది, పదిహేను నిముషాలు తప్ప మిగతా సినిమా చూస్తూ నవ్వుతూనే ఉంటారని సహ నిర్మాత అనంత్‌ సాయి చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక ప్రాంతాల్లో ఈ సినిమాను 125కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు డిస్ట్రిబ్యూటర్‌ విశ్వనాథ్‌ చెప్పారు. దర్శకుడు సంతోష్‌ కంభంపాటి మాట్లాడుతూ ‘కన్ఫ్యూజ్‌ కిడ్నాప్‌ డ్రామా ఇది. దానికి ఒక చిన్న థిన్‌ లైన్‌ ఉంది. ఆ లైన్‌ దాటితే ఆడియన్స్‌ కన్ఫ్యూజ్‌ అవుతారు. అందుకే నా మీద నమ్మకం ఉంచి సినిమా తీసిన నిర్మాతలకు ధన్యవాదాలు’ అన్నారు. సినిమా బాగా వచ్చిందనీ, థియేటర్లలో ఈ నెల 19న చూడండి అని నిర్మాతలు మహీధర్‌ రెడ్డి, దేవేష్‌ చెప్పారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని హీరో చైతన్యా రావు తెలిపారు.

Updated Date - Apr 17 , 2024 | 02:50 AM