మంచి ఫీల్‌తో బయటకు వస్తారు
ABN , Publish Date - May 10 , 2024 | 01:25 AM
నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు...

నటుడు సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వి.వి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కృష్ణమ్మ’ సినిమా ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించింది. హీరో సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు ఈ సినిమాకు బెస్ట్ స్ర్కిప్ట్‌ను ఇచ్చారు. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు గొప్ప చిత్రాన్ని చూశామనే మంచి ఫీల్‌తో బయటకి వస్తారు’’ అని చెప్పారు. దర్శకుడు వి.వి గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలోని ప్రధాన పాత్రల జీవితాల్లో తిరిగే మలుపులు కృష్ణా నది మలుపులను తలపిస్తాయి’’ అని చెప్పారు.