పదినిమిషాలకోసారి పగలబడి నవ్వుతారు

ABN , Publish Date - Jan 31 , 2024 | 01:38 AM

‘హ్యాపీ ఎండింగ్‌’ ప్యూర్‌ యూత్‌ఫుల్‌ మూవీ. ఇందులో హ్యూమర్‌కి కొదవుండదు. ప్రతి పదినిమిషాలకోసారి పగలబడి నవ్వుకుంటారు’ అంటున్నారు కథానాయుక అపూర్వరావ్‌. ‘హ్యాపీ ఎండింగ్‌’ సినిమా ద్వారా ఆమె కథానాయికగా పరిచయం అవుతున్నారు...

పదినిమిషాలకోసారి పగలబడి నవ్వుతారు

‘హ్యాపీ ఎండింగ్‌’ ప్యూర్‌ యూత్‌ఫుల్‌ మూవీ. ఇందులో హ్యూమర్‌కి కొదవుండదు. ప్రతి పదినిమిషాలకోసారి పగలబడి నవ్వుకుంటారు’ అంటున్నారు కథానాయుక అపూర్వరావ్‌. ‘హ్యాపీ ఎండింగ్‌’ సినిమా ద్వారా ఆమె కథానాయికగా పరిచయం అవుతున్నారు. యష్‌ పూరి హీరోగా, కౌశిక్‌ భీమిడి దర్శకత్వంలో యోగేశ్‌ కుమార్‌, సంజయ్‌రెడ్డి, అనిల్‌ పల్లాల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అపూర్వరావ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘మా నేటివ్‌ ప్లేస్‌ ఒంగోలు. నాన్న ఉద్యోగం వల్ల చైల్డ్‌హుడ్‌ మొత్తం గుజరాత్‌లో గడిచింది. అక్కడ్నుంచి కువైట్‌వెళ్లాం. అక్కడే ప్రైమరీ ఎడ్యుకేషన్‌ కంప్లీట్‌ చేశాను. ఇండియాకు తిరిగొచ్చి గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేసి, కొంతకాలం జాబ్‌ కూడా చేశాను. సంతృప్తినివ్వలేదు. నాకు నటనంటే పిచ్చి. ఇంట్లోవాళ్ల సహకారం లేదు. ఇక పట్టుబట్టి, వాళ్లను ఒప్పించి హైదరాబాద్‌లో దాదాఫాల్కే ఫిల్మ్‌స్కూల్‌లో జాయినై ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఆ టైమ్‌లో పరిచయమైన కొందరు అసిస్టెంట్‌ డైరెక్టర్లు, వాళ్ల కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా ‘హ్యాపీ ఎండింగ్‌’ ఆడిషన్స్‌కు వెళ్లే అవకాశం వచ్చింది. బాగా పర్‌ఫార్మ్‌ చేసే తెలుగుమ్మాయి కోసం చూస్తున్న వాళ్లకు నేను నచ్చాను. అలా ఈ సినిమాలో అవకాశం దొరికింది. ఒక మంచి ఎంటర్‌టైనర్‌ ద్వారా పరిచయం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పారు అపూర్వరావ్‌. ఇంకా మాట్లాడుతూ ‘ఇందులో హీరోకు ఓ సమస్య ఉంటుంది. దానివల్ల తను చేయాలనుకున్న పనులు చేయలేకపోతాడు. ఈ సమస్యను హీరో ఎలా ఎదుర్కొన్నాడు, అందుకు తను చేసే ప్రయత్నాలేంటి అనేది చాలా హ్యూమర్‌గా ఉంటుంది.’ అని తెలిపారు అపూర్వ. కో ఆర్టీస్టులందరూ చక్కగా సహకరించారని, సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంటుందని, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా చూడాల్సిన సినిమా ఇదని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Jan 31 , 2024 | 01:38 AM