ఆ విషయంలో మార్పు రావాలి

ABN , Publish Date - May 07 , 2024 | 05:51 AM

తెలుగు, త మిళంలో అగ్ర హీరోల చిత్రాల్లో నటించి వరుస విజయాలు అందుకున్న నటి జ్యోతిక. కెరీర్‌ పీక్‌ టైమ్‌లోనే నటుడు సూర్యని పెళ్లి చేసుకుని సినిమాల్లో నటించడం తగ్గించారు...

ఆ విషయంలో మార్పు రావాలి

తెలుగు, త మిళంలో అగ్ర హీరోల చిత్రాల్లో నటించి వరుస విజయాలు అందుకున్న నటి జ్యోతిక. కెరీర్‌ పీక్‌ టైమ్‌లోనే నటుడు సూర్యని పెళ్లి చేసుకుని సినిమాల్లో నటించడం తగ్గించారు. అప్పుడప్పుడు నటనా ప్రాధాన్యమున్న పాత్రలతో ప్రేక్షకులను పలకరించే ఆమె.. బాలీవుడ్‌ చిత్రం శ్రీకాంత్‌ బొల్లా బయోపిక్‌ ‘శ్రీకాంత్‌’లో కీలక పాత్రను పోషించారు. ఈ నెల 10న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా జ్యోతిక మీడియాతో ముచ్చటించారు.


‘‘నాకు వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్రల్లో నటించడం ఇష్టం. ఇందులో నేను టీచర్‌గా నటించాను. ఒక ఫ్రెండ్‌గా, తల్లిగా, టీచర్‌గా శ్రీకాంత్‌ పాత్ర అనుకున్నది చేయడానికి నేను సహకరిస్తాను. నా కెరీర్‌లో నేను చేసిన పాత్రల్లో హృదయానికి బాగా చేరువైన రోల్‌ ఇది. పుట్టుకతోనే అంధుడిగా పుట్టిన శ్రీకాంత్‌ అనే ఒక సాధారణ వ్యక్తి, వ్యవస్థగా మారడమే ఈ సినిమా కథాంశం. విద్యార్థిగా, వ్యాపార వేత్తగా శ్రీకాంత్‌ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లకు ఏ విధంగా సమాధానం చెప్పాడో సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. ఈ బయోపిక్‌లో రాజ్‌కుమార్‌ రావు నటన అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. పాత్ర కోసం ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్‌ నిజంగా అద్భుతం. ఈ సినిమా సెట్స్‌కు అప్పుడుప్పుడు ‘శ్రీకాంత్‌’ మూవీ రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ శ్రీకాంత్‌ బొల్లా వచ్చేవారు. తెలుగువాడైన శ్రీకాంత్‌ బొల్లా జీవితం నిజంగా ఒక ఇన్స్పిరేషనల్‌ జర్నీ. ఈ సినిమా విద్యార్థులకు కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చనే నమ్మకాన్ని కల్పిస్తుంది. అలాగే, ఇందులోని సన్నివేశాలు యూత్‌ను, కుటుంబాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక, ఎక్కడచూసినా సినిమాల్లో మహిళా సాధికారత గురించి చర్చ నడుస్తోంది. ఆ విషయంలో మార్పు రావాలి. ప్రత్యేకించి ఉమెన్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలు తీయక్కర్లేదు. కథలోనే మహిళలకు సమాన అవకాశం ఉన్న పాత్రలు సృష్టిస్తే సరిపోతుంది’’ అని చెప్పారు.

Updated Date - May 07 , 2024 | 05:51 AM