అటు రజనీకాంత్‌.. ఇటు ఎన్టీఆర్‌

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:31 AM

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం హిమాలయ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన ఆధ్మాత్మిక యాత్రలో భాగంలో కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ దేవాలయాలను సందర్శించిన...

అటు రజనీకాంత్‌.. ఇటు ఎన్టీఆర్‌

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం హిమాలయ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన ఆధ్మాత్మిక యాత్రలో భాగంలో కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ దేవాలయాలను సందర్శించిన రజనీకాంత్‌ ఇప్పుడు అక్కడున్న సాధువులను కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ సాధువుతో ఆధ్మాత్మిక విషయాలు చర్చిస్తూనే తన సినిమాల ముచ్చట్లు కూడా వివరించారు. ప్రస్తుతం ‘వెట్టియాన్‌లో నటిస్తున్నాను. నా వర్క్‌ పూర్తయింది. మిగిలిన నటీనటుల మీద చిత్రీకరణ జరుగుతోంది. విజయదశమి సందర్భంగా అక్టోబరు పదిన ఆ సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు. నా కొత్త సినిమా ‘కూలీ’ షూటింగ్‌ ఈ నెల పదిన ప్రారంభమవుతుంది. ఈ సినిమాలకు లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహిస్తారు’ అని ఆ సాఽధువుకు చెప్పారు రజనీకాంత్‌.


జూనియర్‌ ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘దేవర పార్ట్‌ 1’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అదే రోజున రజనీకాంత్‌ సినిమా కూడా వస్తుండడంతో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ తప్పదంటున్నారు సినీ పరిశీలకులు. అయితే రజనీకాంత్‌ చిత్రం విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఉంటుందా లేదా అని తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

Updated Date - Jun 04 , 2024 | 12:31 AM