ఆ ప్రచారంలో నిజం లేదు

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:25 AM

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘స్పిరిట్‌’. ఈ సినిమాలో విలన్‌గా నటించడం కోసం కొంత కాలం నుంచి సైఫ్‌ అలీఖాన్‌తో పాటు ఆయన భార్య కరీనాని...

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘స్పిరిట్‌’. ఈ సినిమాలో విలన్‌గా నటించడం కోసం కొంత కాలం నుంచి సైఫ్‌ అలీఖాన్‌తో పాటు ఆయన భార్య కరీనాని మూవీ మేకర్స్‌ సంప్రతించారని, దానికి వారు కూడా సానుకూలంగా స్పందించారని వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ..అవి జస్ట్‌ రూమర్స్‌ అని కొట్టి పారేశారు. తమదైన విలక్షణ నటనతో బాలీవుడ్‌ని దశాబ్దాల నుంచి ఏలుతున్న ఈ జంట...సందీప్‌ రెడ్డి సినిమాలో చేయడం లేదని క్లారిటీ రావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.

Updated Date - Oct 21 , 2024 | 03:25 AM