ఇప్పుడంత టైమ్ లేదు
ABN , Publish Date - Aug 19 , 2024 | 04:51 AM
మహేశ్‌బాబుతో సినిమా చేసేందుకు ఇప్పుడు టైమ్ కుదిరేలా లేదన్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన...
మహేశ్‌బాబుతో సినిమా చేసేందుకు ఇప్పుడు టైమ్ కుదిరేలా లేదన్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఆదివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహేశ్‌తో సినిమా ఎప్పుడు చేస్తారని అడగ్గా... ‘ప్రభాస్‌తో స్పిరిట్ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్తుంది, ఆ తర్వాత యానిమల్ 2 చిత్రాన్ని ప్రారంభిస్తా, ఈ రెండు సినిమాలను పూర్తి చేయడానికే నాలుగేళ్లు పడుతుంది. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తాను’ అని సందీప్ రెడ్డి చెప్పారు.