గుర్తింపు కోసం నగ్నంగా నటించాల్సిన అవసరం లేదు

ABN , Publish Date - Nov 29 , 2024 | 06:10 AM

మలయాళ నటి దివ్యప్రభ నటించిన చిత్రం ‘ఆల్‌ వియ్‌ ఇమాజిన్‌ ఆజ్‌ లైట్‌’. ఈ సినిమా ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందులో ఆమె నటించిన ఓ న్యూడ్‌ సీన్‌ క్లిప్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ నెటిజన్లు...

మలయాళ నటి దివ్యప్రభ నటించిన చిత్రం ‘ఆల్‌ వియ్‌ ఇమాజిన్‌ ఆజ్‌ లైట్‌’. ఈ సినిమా ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇందులో ఆమె నటించిన ఓ న్యూడ్‌ సీన్‌ క్లిప్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. వీటిపై స్పందించారు దివ్య ప్రభ. ‘‘ఈ సినిమాని అంగీకరించినప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించాను. నేను ఆ సన్నివేశంలో నటించడాన్ని కొందరు విమర్శిస్తున్నారు. సినిమా మొత్తం చూడకుండా కేవలం ఈ సన్నివేశాన్ని మాత్రమే షేర్‌ చేస్తోన్న వారి మైండ్‌ సెట్‌ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను గుర్తింపు కోసం ఇటువంటి పని చేశా అంటున్నారు. ఒక నటిగా మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలనే నేను అంగీకరిస్తా. ఈ సినిమాలో నా పాత్ర నచ్చి.. అవసరం మేరకే ఆ సన్నివేశంలో నటించాను. కేవలం గుర్తింపు కోసం నగ్నంగా నటించాల్సిన అవసరం నాకు లేదు. ఒక నటిగా ఇప్పటికే నేను నటించిన చిత్రాలకు పలు పురస్కారాలు.. ప్రశంసలు దక్కాయి’’ అని పేర్కొన్నారు. కాగా, మేలో జరిగిన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 77వ ఎడిషన్‌లో గ్రాండ్‌ ప్రిక్స్‌ అవార్డును గెలుచుకున్న ఈ చిత్రాన్ని పాయల్‌ కపాడియా తెరకెక్కించారు. ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. దగ్గుబాటి రానా ఈ సినిమాను దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్‌ చేశారు.

Updated Date - Nov 29 , 2024 | 06:10 AM