అప్పుడు మున్నాభాయ్‌ తప్పక వస్తాడు

ABN , Publish Date - Jan 02 , 2024 | 05:11 AM

రాజ్‌కుమార్‌ హిరాణీ దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు. వందశాతం సక్సెస్‌రేట్‌ ఉన్న అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన కూడా ఒకరని నిస్సంకోచంగా చెప్పొచ్చు. ఆయన తీసిన సినిమాలన్నీ...

అప్పుడు మున్నాభాయ్‌ తప్పక వస్తాడు

రాజ్‌కుమార్‌ హిరాణీ దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు. వందశాతం సక్సెస్‌రేట్‌ ఉన్న అతికొద్ది మంది దర్శకుల్లో ఆయన కూడా ఒకరని నిస్సంకోచంగా చెప్పొచ్చు. ఆయన తీసిన సినిమాలన్నీ అద్భుతాలే. రీసెంట్‌గా వచ్చిన ‘డంకీ’ సైతం మూడొందలకోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టడమేకాక, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘డంకీ’ వసూళ్ల గురించి ఇటీవల ఆయన మాట్లాడుతూ ‘ ఈసినిమా వసూళ్లను భారీ స్థాయిలో మేం ఆశించలేదు. కారణం ఇది కమర్షియల్‌ మాస్‌ సినిమా కాదు. ఇదొక వినోదంతో కూడిన సందేశాత్మక చిత్రం. షారుక్‌ కూడా ఈ సినిమా విషయంలో క్లారిటీగా ఉన్నాడు. అనుకున్నట్టే స్లోగా పికప్‌ అవుతోంది. ప్రస్తుతమైతే కలెక్షన్లు నిలకడగా ఉన్నాయి’ అని చెప్పారు హిరాణీ.. ‘మున్నాభాయ్‌’ ఫ్రాంచైజీ గురించి మాట్లాడుతూ ‘రెండు భాగాలూ నాకు మంచి పేరు తెచ్చాయి. వసూళ్ల పరంగా కూడా రికార్డులు సృష్టించాయి. మూడో భాగం చేయాలని ఉంది. సగం స్ర్కిప్ట్‌ కూడా రెడీగా ఉంది. అయితే.. తొలి రెండు భాగాల స్థాయిలో కథ రాకపోతే మాత్రం చేయను. సంతృప్తికరంగా వస్తే తప్పకుండా ‘మున్నాభాయ్‌’ మరోసారి మిమ్మల్ని పలకరిస్తాడు’ అంటూ చెప్పుకొచ్చారు రాజ్‌కుమార్‌ హిరాణీ.

Updated Date - Jan 02 , 2024 | 05:11 AM