థియేటర్లు పెరుగుతున్నాయి

ABN , Publish Date - Aug 04 , 2024 | 03:45 AM

రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా జంటగా రూపొందిన ‘తిరగబడరా సామీ’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవంలో నిర్మాత మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ...

రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా జంటగా రూపొందిన ‘తిరగబడరా సామీ’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవంలో నిర్మాత మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ ‘మొత్తం 200 థియేటర్లలో విడుదల చేశాం. ఈ రోజు మరో 20 థియేటర్లు పెరిగాయి. మా సినిమాకు మంచి రిపోర్ట్‌ వచ్చింది. దర్శకుడు రవికుమార్‌ చౌదరి అద్భుతంగా తీశారు. లేడీ విలన్‌గా మన్నారా చోప్రా చక్కగా నటించింది’ అన్నారు. మంచి సినిమాను ఏదీ అడ్డుకోలేదని ప్రేక్షకులు నిరూపించారని దర్శకుడు రవికుమార్‌ చౌదరి చెప్పారు.

Updated Date - Aug 04 , 2024 | 03:45 AM