నేరస్థుల పాలిట యముడు
ABN , Publish Date - Sep 26 , 2024 | 01:19 AM
‘జై భీమ్’ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్’ (ద హంటర్). ఇందులో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రలు...
‘జై భీమ్’ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్’ (ద హంటర్). ఇందులో అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రలు పోషించారు. 33 ఏళ్ల తర్వాత రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలసి నటించిన చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. తాజాగా, రజనీ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఓ ప్రివ్యూను విడుదల చేశారు. ఇందులో నేరస్థుల పాలిట యముడిగా.. ఎన్‌కౌంటర్ స్పెషలి్‌స్టగా.. ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో హింటిచ్చారు. అలాగే, సినిమాలోని ముఖ్య పాత్రధారుల్ని ఈ వీడియోలో పరిచయం చేశారు. దసరా కానుకగా అక్టోబరు 10న ప్రేక్షకులను పలకరించనుంది.