బయట ప్రపంచం చాలా చెత్తగా ఉంది
ABN , Publish Date - Aug 23 , 2024 | 06:23 AM
‘ఏ మహిళ అయినా ఎవరితోనూ తన ఇబ్బందిని చెప్పుకొనే ధైర్యం చేయలేదని అనిపిస్తేనే ఆమెను మరింత ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారికి నో చెప్పడం నోర్చుకోవాలి’ అన్నారు మంచు లక్ష్మి. చిత్ర పరిశ్రమలో మహిళా
‘ఏ మహిళ అయినా ఎవరితోనూ తన ఇబ్బందిని చెప్పుకొనే ధైర్యం చేయలేదని అనిపిస్తేనే ఆమెను మరింత ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారికి నో చెప్పడం నోర్చుకోవాలి’ అన్నారు మంచు లక్ష్మి. చిత్ర పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులను వెంటాడి వేధిస్తున్నారని జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెల్లడించిన నేపథ్యంలో మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆమె ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘అన్యాయం జరిగిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్టిస్టులు తెలివిగా నో చెప్పడం నేర్చుకోవాలి. కెరీర్ మొదలు పెట్టిన సమయంలో నన్నూ కొందరు ఇబ్బంది పెట్టారు. వారిపై గట్టిగా అరిచి నాకు వచ్చిన ఛాన్స్ పోగొట్టుకున్నా. కానీ తర్వాత అలాంటి విషయాల్లో తెలివిగా వ్యవహరించడం నేర్చుకున్నా. అప్పటికీ అవతలి వారు విసిగిస్తుంటే మనం వారికి బుద్ధి చెప్పక తప్పదు. ఎందుకంటే బయటి ప్రపంచం చాలా చెత్తగా ఉంది’ అన్నారామె.