ట్రైలర్‌ ప్రామిసింగ్‌గా ఉంది

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:32 AM

‘పలాస 1978’ ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి, సంగీర్తన విపిన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. ఈ న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు వెంటక సత్య దర్శకత్వం వహిస్తుండగా, ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్నారు...

‘పలాస 1978’ ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి, సంగీర్తన విపిన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. ఈ న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు వెంటక సత్య దర్శకత్వం వహిస్తుండగా, ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్నారు. ఆగస్టు 2న సినిమా విడుదలవుతోంది. ఇప్పటికీ రిలీజైన టీజర్‌ అందరినీ ఆకట్టుకుంది. బుధవారం సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన విష్వక్‌ సేన్‌ మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ ప్రామిసింగ్‌గా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. ‘‘సినిమాలోని ప్రతీ పాత్రకూ విశిష్టత ఉంటుంది. సినిమా అందరి అంచనాలకు మించి ఉంటుంది’’ అని రక్షిత్‌ అట్లూరి చెప్పారు. ‘‘ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ చూడని అంశాలు ‘ఆపరేషన్‌ రావణ్‌’లో ఉంటాయి’’ అని దర్శకుడు వెంకట సత్య అన్నారు.

Updated Date - Jul 11 , 2024 | 04:32 AM