ట్రైలర్‌ ప్రామిసింగ్‌గా ఉంది

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:06 AM

ప్రియదర్శి, నభానటేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్‌’. ‘వై దిస్‌ కొలవెరీ’ అనేది ఉపశీర్షిక. అశ్విన్‌ రామ్‌ దర్శకత్వంలో కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మిస్తున్నారు....

ప్రియదర్శి, నభానటేశ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘డార్లింగ్‌’. ‘వై దిస్‌ కొలవెరీ’ అనేది ఉపశీర్షిక. అశ్విన్‌ రామ్‌ దర్శకత్వంలో కె.నిరంజన్‌రెడ్డి, చైతన్య నిర్మిస్తున్నారు. ఈ నెల 19న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ ‘‘ట్రైలర్‌ చాలా ప్రామిసింగ్‌గా, హిలేరియ్‌సగా ఉంది. ‘డార్లింగ్‌’ టీమ్‌ అందరికీ ఆల్‌ ద బెస్ట్‌’ అని చెప్పారు. ప్రియదర్శి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అందరినీ అలరిస్తుంది’’ అని అన్నారు. డైరెక్టర్‌ అశ్విన్‌ రామ్‌ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు ఈ సినిమా చాలా ఫ్రెష్‌ ఫీల్‌ను ఇస్తుంది’’ అని చెప్పారు.

Updated Date - Jul 08 , 2024 | 06:06 AM