Maruthi Nagar Subramanyam: రావు రమేష్ ప్రధానపాత్రలో నటించిన సినిమా టైటిల్ సాంగ్ విడుదల

ABN , Publish Date - Mar 22 , 2024 | 05:33 PM

రావు రమేష్ అంటేనే డైలాగ్స్ తో కూడిన మంచి నటన ప్రదర్శిస్తారు అని నానుడి. ఇప్పుడు అయన మొట్టమొదటిసారిగా కథానాయకుడిగా చేస్తున్న సినిమా 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం'. ఈ సినిమా నుండి టైటిల్ సాంగ్ ని ఈరోజు విడుదల చేశారు. రామ్ మిరియాల పాడారు, భాస్కరభట్ల సాహిత్యం.

Maruthi Nagar Subramanyam: రావు రమేష్ ప్రధానపాత్రలో నటించిన సినిమా టైటిల్ సాంగ్ విడుదల
Title song of Maruthi Nagar Subramanyam is out now

రావు రమేష్ మొదటిసారిగా కథానాయకుడిగా, ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకుడు, కాగా రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. ఇప్పటి వరకు సినిమా చరిత్రలో ఎవరూ చేయని విధంగా ప్రేక్షకుల చేత క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి ఫస్ట్ లుక్ విడుదల చేసింది 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' టీమ్. ఈరోజు ఈ సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు. 

'మారుతీ నగర్ లో ఫేమస్ అంటే నేనేలే...

అందరూ ఇదే మాట అంటారులే!

మహారాజా యోగమే ఆన్ ద వేలో ఉందిలే... 

నన్ను పట్టుకోవడానికే వస్తుందిలే!

చుట్టూ ఉంటారులే నవ్వేటోళ్లు ఏడ్సెటోళ్లు...

ఏం అన్నా గానీ నాకేం ఊడదే!

ఓ... ఇస్తారులే ఉంటే మరి వినేటోళ్లు

ఉచిత సలహాలనే!

నేనే సుబ్రమణ్యం... మై నేమ్ ఈజ్ సుబ్రమణ్యం!

నాకు నేనే ఇష్టం... మీకేంటంట కష్టం''

raorameshmaruthinagarsubram.jpg

అంటూ సాగిన ఈ గీతాన్ని క్రేజీ సింగర్ రామ్ మిరియాల ఆలపించారు. కళ్యాణ్ నాయక్ అందించిన సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం ఈ పాట అందరూ వినేలా చేసింది. సినిమాలో రావు రమేష్ పాత్ర ఎలా ఉండబోతోందో వివరిస్తూ సాగిందీ 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' టైటిల్ సాంగ్. చుట్టుపక్కల ప్రజలు సలహాలు ఇచ్చినా పట్టించుకోనని, తనకు అదృష్టం తక్కువ ఉంది గానీ, త్వరలో మహారాజ యోగం పడుతుందని చెప్పే పాత్రలో రావు రమేష్ కనిపించనున్నారు. ఇంతకు ముందు ఈ పాట ప్రోమో విడుదల చేశారు, దానికే నెటిజన్స్ వేసిన స్టెప్పులు ఇప్పటికే సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

'లుంగీలో రావు రమేష్ గారి లుక్ బావుందని ఎంతో మంది మెసేజెస్ చేశారు. ఆయన్ను చూస్తే నేటివ్ ఫీలింగ్ వచ్చిందన్నారు. సినిమా సైతం అలాగే ఉంటుంది. నేటివిటీతో కూడిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. వినోదంతో పాటు మంచి కథ, భావోద్వేగాలు సైతం సినిమాలో ఉన్నాయి. ఇప్పటి వరకు రావు రమేష్ చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపిస్తారు. త్వరలో ట్రైలర్, సినిమా విడుదల తేదీలు వెల్లడిస్తాం'' అని చెప్పారు దర్శకుడు లక్ష్మణ్.

Updated Date - Mar 22 , 2024 | 06:00 PM