టైటిల్‌ దీపావళికి.. సినిమా సంక్రాంతికి

ABN, Publish Date - Oct 14 , 2024 | 02:09 AM

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా వర్కింగ్‌ టైటిల్‌ ‘ఎన్‌బీకే109’ అని తెలిసిందే. దసరా సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తున్నట్లు...

బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా వర్కింగ్‌ టైటిల్‌ ‘ఎన్‌బీకే109’ అని తెలిసిందే. దసరా సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీపావళికి టైటిల్‌ను ప్రకటిస్తామని తెలిపారు. మరోవైపు, అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్‌ వచ్చేసింది. ‘సింహా’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నాలుగో సారి బాలకృష్ణ నటించనున్న సినిమాను ఈ నెల 16న ప్రారంభిస్తున్నట్లు నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీ ఆచంట ప్రకటించారు. ఈ సినిమా వర్కింగ్‌ టైటిల్‌ ‘బీబీ4’. బాలకృష్ణ కూతురు తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

Updated Date - Oct 14 , 2024 | 02:09 AM