మట్కాకు ముహూర్తం కుదిరింది
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:37 AM
వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ‘మట్కా’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. 1958-82 మధ్య కాలంలో జరిగే పీరియాడికల్ మూవీ ఇది. ఇందులో వరుణ్ నాలుగు విభిన్న గెట్‌ప్సతో కనిపిస్తారు...
వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ‘మట్కా’ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. 1958-82 మధ్య కాలంలో జరిగే పీరియాడికల్ మూవీ ఇది. ఇందులో వరుణ్ నాలుగు విభిన్న గెట్‌ప్సతో కనిపిస్తారు. ప్రస్తుతం కీలకమైన యాక్షన్ ఎపిసోడ్‌ను దర్శకుడు కరుణకుమార్ చిత్రీకరిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంతో జరుగుతోందనీ, నవంబర్ 14న సినిమాను విడుదల చేస్తామనీ నిర్మాతలు డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి చెప్పారు. రిలీజ్ డేట్‌ను వెల్లడిస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో సిగరెట్ కాలుస్తూ మెట్లు దిగి వస్తున్న వరుణ్‌తేజ్ రెట్రో గెటప్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు.