ఉషా పరిణయ గాథ

ABN , Publish Date - Jul 30 , 2024 | 04:27 AM

‘ఉషా పరిణయం’. ‘లవ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనేది ఉపశీర్షిక. ఆగస్టు 2న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం...

ఇంటిల్లిపాదిని ఆకట్టుకునే ప్రేమకథతో రూపొందిన చిత్రం ‘ఉషా పరిణయం’. ‘లవ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ అనేది ఉపశీర్షిక. ఆగస్టు 2న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హీరో సాయిదుర్గ తేజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త నటీనటీలతో రూపొందుతున్న ఇలాంటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే, ఈ తరహా చిత్రాలు మరిన్ని వస్తాయి అని సాయిదుర్గతేజ్‌ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మా కుటుంబం మద్దతుతో ఈ చిత్రాన్ని నిర్మించాను. ధ్రువన్‌ మంచి సంగీతం అందించాడు’ అన్నారు. అందరి సహకారంతో ఓ మంచి సినిమాను అందిస్తున్నాం, సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్‌ చేస్తారు అని హీరో చెప్పారు. ఈ సినిమాతో నటిగా నాకు మంచి పేరు వస్తుందని హీరోయిన్‌ చెప్పారు.

చిత్రం : ఉషా పరిణయం

ప్రొడ్యూసర్‌ : కె. విజయ్‌ భాస్కర్‌

డైరెక్టర్‌ : కె. విజయ్‌ భాస్కర్‌

బ్యానర్‌ : విజయ్‌ భాస్కర్‌ క్రాఫ్ట్స్‌ ప్రొడక్షన్‌

నటీనటులు : శ్రీ కమల్‌, తాన్వీ ఆకాంక్ష, సూర్య

Updated Date - Jul 30 , 2024 | 04:27 AM