తిన్నడి విల్లు కథ

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:44 AM

మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం మీద ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘టీజర్‌’ అంచనాలను మరింత పెంచేసింది. తాజాగా ఈ సినిమాలో విష్ణు వాడిన విల్లుకు...

మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం మీద ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ‘టీజర్‌’ అంచనాలను మరింత పెంచేసింది. తాజాగా ఈ సినిమాలో విష్ణు వాడిన విల్లుకు ఓ విశిష్టత ఉంది. అదేమిటో విష్ణు వివరిస్తూ ‘తిన్నడు వాడిన విల్లు కేవలం ఆయుధం మాత్రమే కాదు.. తండ్రీకొడుకుల అనుబంధానికి ప్రతీక. కన్నప్ప తండ్రి నాదనాథ స్వయంగా తయరు చేసిన ఈ విల్లు కుటుంబ వారసత్వంగా నిలిచింది. పులి ఎముకలు, దంతాలతొ తయారు చేసిన ఈ విల్లుతో కన్నప్ప యుద్ధ భూమిలో అసమానమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తాడు. కళాదర్శకుడు క్రిష్‌ ప్రత్యేకంగా ఈ విల్లు తయారు చేశాడు. సినిమాలో ఈ విల్లు అంతర్భాగం. కన్నప్ప దాన్ని అచంచలమైన బలంతో ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతూల్యతను కాపాడుకుంటాడు. యువతకు స్పూర్తినిచ్చే కథ ఇది’ అన్నారు. త్వరలో విడుదల కానున్న ‘కన్నప్ప’ చిత్రంలో మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, ప్రభాస్‌ తదితరులు నటించారు. ముఖేశ్‌సింగ్‌ దర్శకుడు.


ట్రోలర్స్‌కు మంచు విష్ణు హెచ్చరిక

సినీతారల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, వారి గౌరవానికి భంగం కలిగించేలా పోస్ట్‌ చేసిన వీడియోలు, మీమ్స్‌ను 48 గంటల్లో తొలగించాలని డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌కు నటుడు, మా (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) అధ్యక్షుడు మంచు విష్ణు బుధవారం విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్‌ వీడియోలను వెంటనే తొలగించని పక్షంలో తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవలే తండ్రీ, కూతుళ్లను కించపరిచేలా వీడియోలను పోస్ట్‌ చేసిన క్రియేటర్లపై మండిపడ్డారు. కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం సరికాదని సూచించారు. మహిళలను కించపరిచే పోస్ట్‌లు పెడితే ఇకపై వదిలిపెట్టేది లేదని వీడియోలో పేర్కొన్నారు. ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 11 , 2024 | 04:44 AM