రామానుజుల గొప్పతనం చెప్పే కథ

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:42 AM

డా. సాయి వెంకట్‌ టైటిల్‌ రోల్‌లో నటించి.. దర్శకత్వం వహించిన సినిమా ‘జయహో రామానుజ’. జో శర్మ, సుమన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మిస్తున్నారు....

రామానుజుల గొప్పతనం చెప్పే కథ

డా. సాయి వెంకట్‌ టైటిల్‌ రోల్‌లో నటించి.. దర్శకత్వం వహించిన సినిమా ‘జయహో రామానుజ’. జో శర్మ, సుమన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయిప్రసన్న, ప్రవల్లిక నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘జయహో రామానుజ’ సినిమా పాటలను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో సాయి వెంకట్‌ మాట్లాడుతూ ‘మహిళల్ని గౌరవించాలని.. కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో మానవాళి కలసి ఉండాలని సందేశాన్ని ఇచ్చిన గొప్ప గురువు భగవత్‌ శ్రీ రామానుజాచార్యులు. ఆయన గొప్పదనం ఈ తరం వారికి తెలియాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను’ అని చెప్పారు. నిర్మాత ప్రవ ల్లిక మాట్లాడుతూ ‘భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్‌, దర్శకుడు వీరశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 06:42 AM