దక్షిణాదికి వచ్చిన దెయ్యం కథ

ABN , Publish Date - May 03 , 2024 | 05:23 AM

తమన్నా, రాశీ ఖన్నా, సుందర్‌ నటించిన ‘బాక్‌’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నటుడు, చిత్ర దర్శకుడు సి. సుందర్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘అరణ్మనై’ సిరీ్‌సలో...

దక్షిణాదికి వచ్చిన దెయ్యం కథ

తమన్నా, రాశీ ఖన్నా, సుందర్‌ నటించిన ‘బాక్‌’ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నటుడు, చిత్ర దర్శకుడు సి. సుందర్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘అరణ్మనై’ సిరీ్‌సలో నాలుగో చిత్రమిది. మొదటి మూడు సినిమాలు తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ అయ్యాయి. ఈ చిత్ర కథ కోసం రీసెర్చ్‌ చేసే క్రమంలో చరిత్రతో ముడిపడిన ఓ ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అస్సామీ జానపదంలో ‘బాక్‌’ అనే ఘోస్ట్‌ ఉండేదని అక్కడివారి నమ్మకం. తమ ప్రాంతాన్నాంతా చేతబడి చేశారని వారి విశ్వాసం. ఆ విషయం విని ఆశ్చర్యపోయా. అదే ‘బాక్‌’ కథకు బీజం వేసింది. అస్సామీ, బ్రహ్మపుత్ర ప్రాంతంలో ఉండే బాక్‌ అనే దెయ్యం సౌత్‌కి వస్తే ఎలాంటి పరిణామాలు సంభవించాయన్నది ఈ చిత్రకథ’ అన్నారు.

Updated Date - May 03 , 2024 | 05:24 AM