డీజే కావాలనుకొనే మూర్తి కథ

ABN , Publish Date - May 26 , 2024 | 05:58 AM

అజయ్‌ ఘోష్‌, చాందినీ చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ చిత్రం జూన్‌ 14న విడుదల కానుంది. శివ పాలడుగు దర్శకత్వంలో...

డీజే కావాలనుకొనే మూర్తి కథ

అజయ్‌ ఘోష్‌, చాందినీ చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ చిత్రం జూన్‌ 14న విడుదల కానుంది. శివ పాలడుగు దర్శకత్వంలో హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు. ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’, ‘బేబి’, ‘డీజె టిల్లు’ వంటి చిత్రాలను పంపిణీ చేసిన ఽధీరజ్‌ మొగిలినేని ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందులో డీజే కావాలనుకొనే మ్యూజిక్‌ షాప్‌ యజమానిగా అజయ్‌ ఘోష్‌ నటించారు. అతని లక్ష్యాన్ని సాధించడానికి సాయం చేసే పాత్రను చాందిని పోషించారు. అజయ్‌ భార్యగా ఆమని నటించారు. సకుటుంబంగా చూడదగ్గ చిత్రం ఇదని దర్శకనిర్మాతలు చెప్పారు. అద్భుతమైన ఎమోషనల్‌ ట్రీట్‌ అందిస్తుందని తెలిపారు.

Updated Date - May 26 , 2024 | 05:58 AM