తండ్రీ కొడుకుల కథ
ABN, Publish Date - Feb 15 , 2024 | 02:52 AM
నటుడు ధన్‌రాజ్ దర్శకత్వంలో సముద్రఖని ముఖ్యపాత్ర లో నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో...
నటుడు ధన్‌రాజ్ దర్శకత్వంలో సముద్రఖని ముఖ్యపాత్ర లో నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘రామం రాఘవం’. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వీ నిర్మిస్తున్నారు. ప్రేమికుల రోజు సందర్భంగా ‘రామం రాఘవం’ చిత్రం గ్లింప్స్‌ను హీరో రామ్ పోతినేని, దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను కీలకపాత్రలు పోషిస్తున్నారు. శివ ప్రసాద్ యానాల కథను సమకూర్చగా, అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: మార్తాండ్ కే వెంకటేశ్