150 థియేటర్లలో జరగండి పాట

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:45 AM

రామ్‌చరణ్‌, తమిళ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనౌన్స్‌ చేసిన రోజు నుంచే భారీ అంచనాలు ఏర్పడి, రోజురోజుకీ...

150 థియేటర్లలో జరగండి పాట

రామ్‌చరణ్‌, తమిళ దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. దిల్‌రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని అనౌన్స్‌ చేసిన రోజు నుంచే భారీ అంచనాలు ఏర్పడి, రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆసక్తి చాలా మందిలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రామ్‌చరణ్‌కు ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు. బుధవారం రామ్‌చరణ్‌ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి ‘జరగండి’ అనే పాటను విడుదల చేస్తున్నారు. 150 థియేటర్లలో ఈ పాటను ప్రత్యేకంగా ప్రదర్శిస్తుండడం విశేషం. సంగీత దర్శకుడు తమన్‌ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అడ్వాణి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ఎస్‌.జె.సూర్య, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కార్తిక్‌ సుబ్బరాజు అందించిన కథకు సాయిమాధవ్‌ బుర్రా మాటలు రాశారు. తిరుణ్ణావుక్కరసు ఛాయాగ్రాహకుడు.

Updated Date - Mar 27 , 2024 | 01:45 AM