సీతక్క చేతుల మీదుగా ఆకాశమే అందనీ

ABN , Publish Date - Mar 07 , 2024 | 01:37 AM

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’ కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించారు. నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్టకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ఈ నెల 15న ...

సీతక్క చేతుల మీదుగా ఆకాశమే అందనీ

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’ కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించారు. నాగార్జున సామల, శ్రీష్‌ కుమార్‌ గుండా, డాక్టర్‌ కృష్టకాంత్‌ చిత్తజల్లు నిర్మించారు. ఈ నెల 15న థియేట్రికల్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోందీ సినిమా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘ఆకాశం అందనీ’ అంటూ సాగే గీతాన్ని మంత్రి సీతక్క చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ‘‘తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న మహిళలు పోరాడి గెలుచుకున్న రోజు ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’. ఈ సందర్భంగా మహిళా గీత రచయిత చైతన్య పింగళి రాసిన ‘ఆకాశమే అందనీ’ లిరికల్‌ సాంగ్‌ను నా చేతుల మీదుగా రిలీజ్‌ చేయటం ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు చైతన్య రావు, హీరోయిన్‌ భూమి శెట్టి, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ట మాట్లాడారు.

Updated Date - Mar 07 , 2024 | 01:37 AM