ఆరేళ్ల బంధం ముగిసింది

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:14 AM

మొత్తానికి పెళ్లి వరకూ వెళ్లకుండానే అర్జున్‌కపూర్‌, మలైకా అరోరా విడిపోయారు. ఆరేళ్ల క్రితం ఓ ఫ్యాషన్‌ షోలో తొలిసారిగా కలసిన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. మలైకా 45వ పుట్టిన రోజున కానీ ఈ విషయం...

ఆరేళ్ల బంధం ముగిసింది

మొత్తానికి పెళ్లి వరకూ వెళ్లకుండానే అర్జున్‌కపూర్‌, మలైకా అరోరా విడిపోయారు. ఆరేళ్ల క్రితం ఓ ఫ్యాషన్‌ షోలో తొలిసారిగా కలసిన వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. మలైకా 45వ పుట్టిన రోజున కానీ ఈ విషయం బయటపడలేదు. ఇక అప్పటినుంచీ ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలసే వెళ్లేవారు. ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో కూడా అర్జున్‌ పక్కన మలైకా ఉండాల్సిందే. ‘కాఫీ విత్‌ కరణ్‌’ ప్రోగ్రామ్‌లో తమ అనుబంధం గురించి అర్జున్‌ వెల్లడించడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. ఆరేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా కలసి తిరిగిన వీరిద్దరూ మొన్న మే 31న విడిపోయిన విషయం చాలామందికి తెలీదు. తమ బ్రేకప్‌ విషయం ఇద్దరూ సీక్రెట్‌గా ఉంచారు. ఏ విషయంలో వీరిద్దరికీ చెడిందో ఏమో కానీ ఇప్పుడు అర్జున్‌ కెరీర్‌ మీద దృష్టి పెట్టాడు. బుధవారం అతని పుట్టినరోజు కావడంతో తామిద్దరూ కలసి ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది మలైకా.

Updated Date - Jun 27 , 2024 | 12:14 AM