‘దీక్ష’ షూటింగ్‌ పూర్తి

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:23 AM

కిరణ్‌కుమార్‌, అలేఖ్యా రెడ్డి జంటగా నటించిన ‘దీక్ష’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రతాని రామకృష్ణ గౌడ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి పినిశెట్టి అశోక్‌కుమార్‌, మదాడి కృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. సినిమా ప్రోగ్రెస్‌ గురించి...

‘దీక్ష’ షూటింగ్‌ పూర్తి

కిరణ్‌కుమార్‌, అలేఖ్యా రెడ్డి జంటగా నటించిన ‘దీక్ష’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రతాని రామకృష్ణ గౌడ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి పినిశెట్టి అశోక్‌కుమార్‌, మదాడి కృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. సినిమా ప్రోగ్రెస్‌ గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘పట్టుదల, దీక్ష ఉంటే ఏదైనా సాధించగలం.. అనే పాయింట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో హీరో కిరణ్‌ చేసిన ఫైట్స్‌, ఆయన వేసిన భీముడు, ఆంజనేయుడి గెటప్స్‌ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. నలుగురు హీరోయిన్లను ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాం. త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని చెప్పారు. ‘ఇంతకుముందు నేను తెలుగులో పది, తమిళంలో రెండు చిత్రాల్లో హీరోగా నటించాను. ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నా’ అన్నారు కిరణ్‌. నటి తులసి మాట్లాడుతూ ‘ఇందులో లీడ్‌ రోల్‌ పోషించాను. నా పాత్రకు మంచి డైలాగులు కుదిరాయి. సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 03:23 AM