రెండో సీజన్‌ వచ్చేస్తోంది

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:36 AM

టీసీఏ ఫిబ్రవరిలో సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ మొదటి సీజన్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌ సూపర్‌ హిట్‌ కావడంతో ఇప్పుడు నవంబరు 15, 16వ తేదీలలో రెండో సీజన్‌ను నిర్వహించనున్నారు...

టీసీఏ ఫిబ్రవరిలో సెలబ్రిటీ క్రికెట్‌ కార్నివాల్‌ మొదటి సీజన్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌ సూపర్‌ హిట్‌ కావడంతో ఇప్పుడు నవంబరు 15, 16వ తేదీలలో రెండో సీజన్‌ను నిర్వహించనున్నారు. ఇందులో పలువురు సెలబ్రిటీలు ఆడనున్నారు. ఈ మ్యాచ్‌ల ద్వారా వచ్చిన మొత్తం డబ్బును ఆస్ట్రేలియాలోని ‘రాయల్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ మెల్బోర్న్‌’కు విరాళంగా అందజేయనున్నారు. తాజాగా సీజన్‌ 2 సాఫ్ట్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఫౌండర్‌ సాయికృష్ణ మాట్లాడుతూ ‘‘ఇందులో పాల్గొనే సెలబ్రిటీస్‌ ఎంతో బిజీగా ఉన్నా చారిటీ కోసం ఈ మ్యాచ్‌లు ఆడుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘ఈ రెండో సీజన్‌ మొదటి సీజన్‌ కంటే మరింత పెద్ద సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని హీరో శ్రీకాంత్‌ అన్నారు.


‘‘ఇందులో ఆడే ప్రతీ ఒక్కరికీ క్రికెట్‌ అంటే ప్రాణం’’ అని హీరో తరుణ్‌ చెప్పారు. ‘‘సీజన్‌ 1లో ఆడటాన్ని బాగా ఎంజాయ్‌ చేశాను. సీజన్‌ 2 కోసం ఎదురుచూస్తున్నాను’’ అని సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు సినీ హీరోలు ఆది సాయికుమార్‌, సుశాంత్‌, అశ్విన్‌బాబు, సామ్రాట్‌, ఓమ్‌కార్‌, ఆర్టిస్ట్‌ భూపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2024 | 03:36 AM