జీవితానికి తెరరూపం ది గోట్‌ లైఫ్‌

ABN , Publish Date - Jan 11 , 2024 | 02:39 AM

90వ దశకంలో జీవనోపాథి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్‌ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ది గోట్‌ లైఫ్‌’ (ఆడు జీవితం). మలయాళ స్టార్‌హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌...

జీవితానికి తెరరూపం ది గోట్‌ లైఫ్‌

90వ దశకంలో జీవనోపాథి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్‌ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ది గోట్‌ లైఫ్‌’ (ఆడు జీవితం). మలయాళ స్టార్‌హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధానపాత్ర పోషించారు. హాలీవుడ్‌ యాక్టర్‌ జిమ్మీ జీన్‌ లూయిస్‌, అమలాపాల్‌ కీలక పాత్రధారులు. బెన్యామిన్‌ రాసిన గోట్‌ డేస్‌ నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజువల్‌ రొమాన్స్‌ సంస్థ నిర్మించిన ఈ పాన్‌ ఇండియా సినిమా ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని పృథ్వీరాజ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని ప్రముఖహీరో ప్రభాస్‌ రిలీజ్‌ చేశారు. ‘నా స్నేహితుడు ప్రభాస్‌ చేతులమీదుగా ‘ది గోట్‌ లైఫ్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకోసం ఐదేళ్లు కష్టపడ్డాను. మానసికంగా, శారీరకంగా నజీబ్‌ కేరక్టర్‌లా మారిపోయాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. పూర్తిస్థాయి ఏడారిలో రూపొందిన చిత్రం ఇది. ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుందీ సినిమా’ అని పృథ్విరాజ్‌ తెలిపారు. కేఆర్‌ గోకుల్‌, అరబ్‌ ఫేమస్‌ యాక్టర్స్‌ తాలిబ్‌ అల్‌ బలూషి, రిక్‌ ఆబే తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌ కేఎస్‌, సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌, సౌండ్‌ డిజైన్‌: రసూల్‌ పూకుట్టి.

Updated Date - Jan 11 , 2024 | 02:39 AM