తెల్లారు పొద్దుల్లో
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:20 AM
సదన్, ప్రియాంక జంటగా రూపొందుతున్న ‘ప్రణయ గోదారి’ చిత్రం నుంచి తాజాగా ‘తెల్లారు పొద్దుల్లో’ అంటూ సాగే మెలోడియస్, రొమాంటిక్ సాంగ్‌ను నృత్య దర్శకుడు శేఖర్
సదన్, ప్రియాంక జంటగా రూపొందుతున్న ‘ప్రణయ గోదారి’ చిత్రం నుంచి తాజాగా ‘తెల్లారు పొద్దుల్లో’ అంటూ సాగే మెలోడియస్, రొమాంటిక్ సాంగ్‌ను నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ విడుదల చేశారు. సంగీత దర్శకుడు మార్కండేయ రాసి, స్వరపరిచిన ఈ పాటను ధనుంజయ్, అదితి భావరాజు పాడారు. పాట చాలా బాగుందని, అరకులో అందమైన ప్రదేశాల్లో చక్కగా చిత్రీకరించారని శేఖర్ మాస్టర్ ప్రశంసించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత పారమళ్ల లింగయ్య చెప్పారు. పి.ఎల్.విఘ్నేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.