రిలీజ్‌ డేట్‌ ఖరారు

ABN , Publish Date - Aug 20 , 2024 | 02:40 AM

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘వేట్టైయాన్‌’ విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్‌ పదిన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సోమవారం అధికారికంగా...

తమిళ చిత్రరంగ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘వేట్టైయాన్‌’ విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్‌ పదిన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌ సోమవారం అధికారికంగా ప్రకటించింది. సామాజికపరమైన సమస్యలు తీసుకుని ఆకట్టుకొనేవిధంగా చిత్రాలు తీసే దర్శకుడు టీజె జ్ఙానవేల్‌ రూపొందించిన తాజా చిత్రం ఇది. లైకా సంస్థ రజనీకాంత్‌తో నిర్మిస్తున్న ఈ నాలుగో చిత్రంలో బాలీవుడ్‌ మెగాస్థార్‌ అమితాబ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది అమితాబ్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా కావడం మరో విశేషం. అలాగే రజనీకాంత్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ కలసి పని చేస్తున్న చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. వేట్టైయాన్‌’ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ లైకా ప్రొడక్షన్స్‌ హెడ్‌ జీకేఎం తమిళ్‌ కుమరన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - Aug 20 , 2024 | 02:40 AM