రిలీజ్ డేట్ మారింది
ABN , Publish Date - Sep 02 , 2024 | 04:15 AM
రాజ్‌తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా నటించిన ‘భలే ఉన్నాడే’ చిత్రం ఈ నెల 7న విడుదల కావాలి. అయితే అనివార్యకారణాల వల్ల విడుదల తేదీని...
రాజ్‌తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా నటించిన ‘భలే ఉన్నాడే’ చిత్రం ఈ నెల 7న విడుదల కావాలి. అయితే అనివార్యకారణాల వల్ల విడుదల తేదీని వాయిదా వేసినట్లు, 13న రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాత ఎన్.వి కిరణ్‌కుమార్ చెప్పారు. దర్శకుడు మారుతి సమర్పిస్తున్న ఈ చిత్రానికి శివసాయి వర్ధన్ దర్శకుడు. సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అమ్మాయిలకు అందంగా అలంకరణలను చేసే పాత్రను ఇందులో రాజ్‌తరుణ్ పోషించారు. శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి నగేశ్ బానెల్లా ఛాయాగ్రాహకుడు.