రిలీజ్‌ డేట్‌ చెప్పేశారు

ABN , Publish Date - Apr 18 , 2024 | 06:53 AM

ఇంతవరకూ తను పోషించని పాత్రలో నితిన్‌ నటిస్తున్న ‘రాబిన్‌హుడ్‌’ చిత్రం డిసెంబర్‌ 20న విడుదల కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్‌ గెటప్‌ నుంచి...

రిలీజ్‌ డేట్‌ చెప్పేశారు

ఇంతవరకూ తను పోషించని పాత్రలో నితిన్‌ నటిస్తున్న ‘రాబిన్‌హుడ్‌’ చిత్రం డిసెంబర్‌ 20న విడుదల కానుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నితిన్‌ గెటప్‌ నుంచి క్యారెక్టరైజేషన్‌ వరకూ సరికొత్తగా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కమర్షియల్‌ అంశాలే కాకుండా తగినంత వినోదం కలిగిన ఈ సినిమాను డిసెంబర్‌ 20న విడుదల చేస్తున్నాం. క్రిస్మస్‌ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్‌ సెలవులు మా సినిమాకు కలసి వస్తాయనుకుంటున్నాం’ అని నిర్మాతలు నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌ చెప్పారు. రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో నితిన్‌ స్పోర్ట్స్‌ బైక్‌ మీద కూర్చుని ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.

Updated Date - Apr 18 , 2024 | 06:53 AM