పోలీసులు నవ్వారు
ABN , Publish Date - Oct 23 , 2024 | 02:13 AM
‘కార్తికేయ-2’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాల్లో నటించి, మెప్పించిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. ఇటీవల ఆయన ఓ పాడ్‌కా్‌స్టలో మాట్లాడారు. ఓ సారి తన కారు చోరీకి గురికాగా ఫిర్యాదు చేస్తుంటే పోలీసులు...
‘కార్తికేయ-2’, ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాల్లో నటించి, మెప్పించిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. ఇటీవల ఆయన ఓ పాడ్‌కా్‌స్టలో మాట్లాడారు. ఓ సారి తన కారు చోరీకి గురికాగా ఫిర్యాదు చేస్తుంటే పోలీసులు నవ్వారని నాటి చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నాకు డ్రైవ్ చేయడం నచ్చదు. కానీ, ఓ రోజు ముంబయిలో అమ్మవారి దేవాలయానికి నేనే కారు డ్రైవ్ చేస్తూ వెళ్లా. కారును పార్క్ చేసి ఆలయ ప్రాంగణంలోకి చేరుకున్నా. అక్కడి నుంచి చూస్తుంటే.. నా కారును ఓ వ్యక్తి తీసుకెళ్లడం కనిపించింది. వెంటనే కిందికి వచ్చి ఆటో ఎక్కి.. ఆ కారును ఫాలో అవ్వమని డ్రైవర్‌కు చెప్పా. మేం అతడిని పట్టుకోలేకపోయాం. ఫిర్యాదు చేద్దామని సమీప పోలీసుస్టేషన్‌కు వెళ్లా. నా వాహనం ఎలా పోయిందో పోలీసులకు వివరిస్తుంటే.. వారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు’ అని అనుపమ్ ఖేర్ నాటి సంఘటనను వివరించారు.