‘అంబాజీ..’లో కొత్తదనం ఆకట్టుకుంటుంది

ABN , Publish Date - Jan 29 , 2024 | 06:20 AM

సుహాస్‌ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. దుష్యంత్‌ కటికినేని దర్శకత్వంలో ధీరజ్‌ మొగిలినేని నిర్మించారు. ఆయన మీడియాకు చిత్ర విశేషాలు వెల్లడిస్తూ...

‘అంబాజీ..’లో కొత్తదనం ఆకట్టుకుంటుంది

సుహాస్‌ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్‌’ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. దుష్యంత్‌ కటికినేని దర్శకత్వంలో ధీరజ్‌ మొగిలినేని నిర్మించారు. ఆయన మీడియాకు చిత్ర విశేషాలు వెల్లడిస్తూ ‘ఈ సినిమా అనౌన్స్‌ చేసినప్పుడు అంతా కామెడీ మూవీ అనుకున్నారు. పాటలు విడుదలయ్యాక లవ్‌ స్టోరీ కావొచ్చు అనుకున్నారు. కానీ ట్రైలర్‌ చూశాక సీరియస్‌ సబ్జెక్ట్‌ అని అందరికీ అర్థమైంది. సినిమాలో కొత్తదనం ఆకట్టుకుంటుంది. అలాగే సుహాస్‌ పెర్ఫార్మెన్స్‌ ఎంత బాగుంటుందో ఈ సినిమాలో చూస్తారు’ అని తెలిపారు. ‘ఒక ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటనను అలాగే తెరకెక్కించాం. ఇందులో ప్రేమ ఒక అంశం మాత్రమే’ అన్నారాయన. ‘ప్రస్తుతం రష్మిక హీరోయిన్‌గా ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రం చేస్తున్నాం. అది 40 శాతం పూర్తయింది. ఈ ఏడాదే విడుదల చేస్తాం. మరో మూడు ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నాం’ అని ధీరజ్‌ వెల్లడించారు.

Updated Date - Jan 29 , 2024 | 06:20 AM