కాండ్రకోట మిస్టరీ

ABN , Publish Date - May 11 , 2024 | 05:33 AM

యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘నింద’ చిత్రంలో వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటిస్తున్నారు.

కాండ్రకోట మిస్టరీ

యథార్థ సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ‘నింద’ చిత్రంలో వరుణ్‌ సందేశ్‌ హీరోగా నటిస్తున్నారు. స్వీయ దర్శకత్వంలో రాజేశ్‌ జగన్నాథం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కాండ్రకోట మిస్టరీ’ అనే క్యాప్షన్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో వరుణ్‌ సందేశ్‌ లుక్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో వరుణ్‌ అమాయకంగా కనిపిస్తుంటే, బ్యాక్‌ గ్రౌండ్‌లో ఓ ముసుగు వ్యక్తి రూపం ఉంది. ఈ పోస్టర్‌ను రివర్స్‌ చేస్తే న్యాయ దేవత విగ్రహం, ముసుగు వ్యక్తి రూపం కూడా కనిపిస్తున్నాయి. ఆ ముసుగు వ్యక్తి ఎవరు, న్యాయదేవతను ఎందుకు చూపిస్తున్నారు.. సినిమాలో వరుణ్‌ పాత్ర ఏమిటి.. అనే ఆసక్తికర అంశాలకు సినిమాలో సమాధానం లభిస్తుందని రాజేశ్‌ జగన్నాథం చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోందనీ, ఈ నెల 15న టీజర్‌ను విడుదల చేస్తామనీ ఆయన తెలిపారు.

Updated Date - May 11 , 2024 | 05:33 AM