నాన్న డైరెక్షన్‌లో సినిమా అప్పుడే

ABN , Publish Date - Mar 11 , 2024 | 03:33 AM

హీరోగా నా ప్రతిభను నిరూపించుకున్నాకే నాన్న (పూరి జగన్నాథ్‌) దర్శకత్వంలో సినిమా చేస్తాను అని హీరో యశ్‌ పూరి అన్నారు. ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తన సినీ కెరీర్‌ గురించి...

నాన్న డైరెక్షన్‌లో సినిమా అప్పుడే

హీరోగా నా ప్రతిభను నిరూపించుకున్నాకే నాన్న (పూరి జగన్నాథ్‌) దర్శకత్వంలో సినిమా చేస్తాను అని హీరో యశ్‌ పూరి అన్నారు. ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తన సినీ కెరీర్‌ గురించి మీడియాతో ముచ ్చటించారు. ‘నా గత చిత్రం ‘చోర్‌బజార్‌’ అంతగా ఆదరణ పొందలేదు. అందుకే ఈ సారి చేయబోయే సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కుటుంబ ప్రేక్షకులను మెప్పించే చిత్రాలు చేయాలనుకుంటున్నాను. కొన్ని కథలు విన్నాను. లవ్‌స్టోరీ, యాక్షన్‌ జానర్‌లో సినిమాలు ఇష్టం. నాకు అమ్మా, నాన్న ఇద్దరి సపోర్ట్‌ ఉంది. నాన్న నా స్ర్కిప్ట్స్‌ చదివి సలహాలిస్తారు. ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ టీజర్‌ రఫ్‌ కట్‌ చూశాను. రామ్‌ గారి నటన చాలా బాగుంది’ అని ఆకాశ్‌ చెప్పారు.

Updated Date - Mar 11 , 2024 | 03:46 AM