‘పొట్టేల్‌’ చిత్రం శుక్రవారం విడుదలైంది

ABN, Publish Date - Oct 27 , 2024 | 05:47 AM

యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన ‘పొట్టేల్‌’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివ్‌ టాక్‌ ఏ చిత్రానికీ రాలేదని, ప్రతి థియేటర్‌లో సినిమాకు స్టాండింగ్‌ ఓవేషన్‌ వస్తోందని దర్శకుడు సాహిత్‌ మోత్కూరి చెప్పారు...

యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన ‘పొట్టేల్‌’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ మధ్య కాలంలో ఇంత పాజిటివ్‌ టాక్‌ ఏ చిత్రానికీ రాలేదని, ప్రతి థియేటర్‌లో సినిమాకు స్టాండింగ్‌ ఓవేషన్‌ వస్తోందని దర్శకుడు సాహిత్‌ మోత్కూరి చెప్పారు. తన నటనకు అందరి నుంచి అభినందనలు వస్తున్నందుకు యువచంద్ర కృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. సినిమా చూశాక అందరూ తనని బుజ్జమ్మా అని పిలుస్తున్నారని అనన్య చెప్పారు. మంచి సినిమా తీశామని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారని నిర్మాత తెలిపారు.

Updated Date - Oct 27 , 2024 | 05:47 AM