'Love Me' : ‘లవ్‌ మీ’ చిత్రం ఘనవిజయం సాధించాలి

ABN , Publish Date - May 24 , 2024 | 03:25 AM

ఆశిష్‌, ‘బేబీ’ ఫేమ్‌ వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘లవ్‌ మీ’. ‘ఇఫ్‌ యు డేర్‌’ అనేది ఉప శీర్షిక. దిల్‌ రాజు, శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహించారు...

'Love Me' : ‘లవ్‌ మీ’ చిత్రం ఘనవిజయం సాధించాలి

ఆశిష్‌, ‘బేబీ’ ఫేమ్‌ వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘లవ్‌ మీ’. ‘ఇఫ్‌ యు డేర్‌’ అనేది ఉప శీర్షిక. దిల్‌ రాజు, శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్సిత, నాగ మల్లిడి నిర్మించారు. అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘ఈ మూవీ కోసం చిత్రబృందం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలి. ‘లవ్‌ మీ’ టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అని అన్నారు. ‘‘లవ్‌ మీ’ డిఫరెంట్‌ సినిమా. ఈ చాలెంజింగ్‌ స్ర్కిప్ట్‌ను అరుణ్‌ తెరకెక్కించిన విధానం సూపర్బ్‌. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకి ఈ సినిమా తప్పక నచ్చుతుంది’’ అని నిర్మాత దిల్‌రాజు చెప్పారు. సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో దర్శకుడు అరుణ్‌ నాన్‌ లీనియర్‌ నేరేషన్‌కు కొత్త నిర్వచనం ఇచ్చారు’’ అని అన్నారు.


చిత్ర దర్శకుడు అరుణ్‌ భీమవరపు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కిల్‌ మీ ఇఫ్‌ యు డేర్‌’ వస్తుంది’’ అని చెప్పారు. హీరో ఆశిష్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా సక్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సంగీత దర్శకుడు కీరవాణి, సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్‌ వంటి దిగ్గజాలు ఈ సినిమాకు వర్క్‌ చేయటంతో లక్కీగా ఫీలవుతున్నాం’’ అని చెప్పారు.

Updated Date - May 24 , 2024 | 03:25 AM