సినిమా బ్లాక్‌ బస్టర్‌

ABN , Publish Date - May 02 , 2024 | 04:34 AM

సుహాస్‌ హీరోగా రూపొందిన యూనిక్‌ సస్పెన్స థ్రిల్లర్‌ ‘ప్రసన్న వదనం’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సుహాస్‌ మాట్లాడుతూ ‘తొలి కాపీ చూశాం...

సినిమా బ్లాక్‌ బస్టర్‌

సుహాస్‌ హీరోగా రూపొందిన యూనిక్‌ సస్పెన్స థ్రిల్లర్‌ ‘ప్రసన్న వదనం’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సుహాస్‌ మాట్లాడుతూ ‘తొలి కాపీ చూశాం. సినిమా బ్లాక్‌ బస్టర్‌ . ఇందులో సందేహం లేదు. నా సినిమాలు మౌత్‌ టాక్‌ వల్లే ఆడతాయి కనుక తొందరగా చూసి మిగిలిన వారికి చెప్పండి. సీట్‌ ఎడ్జ్‌లో కూర్చుని సినిమా చూస్తారు’ అని చెప్పారు. ‘దర్శకుడిగా నాకు ఇదే తొలి సినిమా. బాగా వచ్చింది. యూనిక్‌ కాన్సెప్ట్‌తో రూపుదిదుకొన్న రియల్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌ ఇది. సుహాస్‌ అద్భుతంగా చేశాడు’ అన్నారు దర్శకుడు అర్జున్‌. అందరూ థియేటర్‌లో సినిమా చూసి ప్రోత్సహించాలని నిర్మాత మణికంఠ కోరారు.

Updated Date - May 02 , 2024 | 04:34 AM