సందేశం వినోదం కలబోతగా

ABN , Publish Date - May 13 , 2024 | 12:04 AM

నూతన నటీనటులతో తెరకెక్కిన వినోదాత్మక చిత్రం ‘అక్కడ వారు ఇక్కడ ఉన్నారు’. సాయిహర్షిణి, ఎస్‌వీ రమణ, పి. లలిత, పిల్లి విజయ్‌కుమార్‌ ప్రధాన తారాగణం...

సందేశం వినోదం కలబోతగా

నూతన నటీనటులతో తెరకెక్కిన వినోదాత్మక చిత్రం ‘అక్కడ వారు ఇక్కడ ఉన్నారు’. సాయిహర్షిణి, ఎస్‌వీ రమణ, పి. లలిత, పిల్లి విజయ్‌కుమార్‌ ప్రధాన తారాగణం. కుందుర్తి త్రివిక్రమరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని యూనిట్‌ ఆదివారం తెనాలిలో నిర్వహించింది. ఈ సందర్భంగా త్రివిక్రమరావు మాట్లాడుతూ ‘10 రోజుల సింగిల్‌ షెడ్యూల్‌లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేశాం. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాం. వినోదంతో పాటు ఈ తరానికి చక్కటి సందేశం ఇచ్చే చిత్రమిది’ అన్నారు. ఈ చిత్రానికి శ్రీ వెంకట్‌ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: రాజు కేశన్న. ఎడిటర్‌: వెంకట్‌.

Updated Date - May 13 , 2024 | 12:04 AM